News May 10, 2024

గిద్దలూరు: ఓటుకు నోటులో ఇద్దరు అరెస్ట్

image

గిద్దలూరు మండలంలోని ముళ్లపాడులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరిని శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 18, 2025

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

image

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్‌ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్‌లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.

News February 18, 2025

టెట్‌ విషయంలో లోకేశ్‌పై ప్రకాశం MLA సెటైర్లు

image

మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి X వేదికగా కామెంట్ చేశారు.”బాబు లోకేశ్ గారు మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, జగనన్న హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. 9 నెలల తర్వాత అడుగుతున్నా. మీ హెరిటేజ్ సంస్థ షేర్ పెరిగిందని, సంతకం పెట్టిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు దొర.? అని ట్వీట్ చేశారు.

News February 18, 2025

ప్రకాశం: SP పరిష్కార వేదికకు 81 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలువైపుల నుంచి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ వేదికకు 81 ఫిర్యాదుల అందినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

error: Content is protected !!