News April 29, 2024
గిద్దలూరు: వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Similar News
News January 8, 2026
అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
News January 8, 2026
మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఎస్పీ

వృద్ధులే లక్ష్యంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని SP హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది, ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అని అన్నారు. అపరిచితుల వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930కి కాల్ చేయాలని సూచించారు.


