News September 30, 2024
గిద్దలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి
గిద్దలూరు మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సర్విరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న 6 సంవత్సరాల బాలుడిని, వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.
Similar News
News October 13, 2024
ప్రకాశం: మద్యం దుకాణాల లాటరీలు ఇవే.!
మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ES ఖాజా మొహియుద్దీన్ వెల్లడించారు. జిల్లాలో 171 దుకాణాలకు 3466 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో సోమవారం ఉదయం 8 గంటలకు పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహిస్తామని.. ఇందుకోసం 2 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒకటి, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
News October 13, 2024
ప్రకాశం జిల్లాకు వర్ష సూచన.. కాల్ సెంటర్ ఏర్పాటు
దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News October 13, 2024
ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.