News February 25, 2025

గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

image

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.

Similar News

News February 25, 2025

కమీషన్ల కక్కుర్తితో కంపెనీలను తరిమేశారు: స్వామి

image

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమల్ని తరిమివేశారని మంత్రి స్వామి శాసన మండలిలో ధ్వజమెత్తారు. మంగళవారం మండలిలో జరిగిన గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంలో వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలూ, అమర్ రాజా, ఏషియన్ పార్క్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలన్నింటిని తరిమి వేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.

News February 25, 2025

పి-4 సర్వేను వేగవంతం చేయండి: ప్రకాశం కలెక్టర్

image

పి-4 సర్వేను వేగవంతం చేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి ఒకటో తేదీన పెన్షన్‌ల పంపిణీ ఉంటుందని, రెండో తేదీ ఆదివారం అయినందున ఈ సర్వేను ఈవారం లోనే పూర్తి చేయాలని స్పష్టం చేసారు. క్షేత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది మరింత చురుకుగా పని చేయాలని ఆమె కోరారు.

News February 25, 2025

ప్రకాశం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష

image

2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి, 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ఆసక్తి కనబరిచే విద్యార్థులు ఆన్లైన్‌లో మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

error: Content is protected !!