News April 5, 2024
గిద్దలూరు MLA అన్నా రాంబాబు పై కేసు నమోదు

గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News December 19, 2025
ప్రకాశం: 18 మంది కార్యదర్శులకు నోటీసులు.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్నులను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులకు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా రాత పూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని డీపీఓ ఆదేశించారు.
News December 19, 2025
ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.
News December 19, 2025
ప్రకాశం జిల్లాలో వీరి కల నెరవేరేదెన్నడో?

సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే కేంద్రం పీఎం గ్రామీణ ఆవాస్ యోజన ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. నవంబర్ 6 నుంచి జిల్లాలో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 38 మండలాల్లో 729 పంచాయతీల్లో 41,706 మంది సొంతింటి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. వీరి దరఖాస్తుల రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా, ప్రస్తుతం వీరి సొంతింటి కల నెరవేరడమే తరువాయి భాగం.


