News April 15, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాపట్ల విద్యార్థి

బల్లికురవ మండలంలోని వల్లాపల్లి ఎంపీయూపీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న మందా వివేక్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హోలెల్ మ్యూజిక్ స్కూల్ తరఫున నిర్వహించిన బృందం సంగీతంలో వివేక్ సత్తా చాటాడు. హైదరాబాద్ హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థికి సోమవారం మెడల్, సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థిని సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News January 10, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గత పది రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 6,665 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,553 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి నిల్వ చేయవద్దని, డిమాండ్ మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని రైతులకు సూచించారు.
News January 10, 2026
మెదక్: ‘సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు’

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఏడు రోజుల సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయని, సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News January 10, 2026
తిరుపతిలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతి రూరల్ తనపల్లి జంక్షన్ దగ్గర ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


