News April 2, 2025
గిబ్లీ ట్రెండ్లోకి పుట్టపర్తి ఎమ్మెల్యే

సోషల్ మీడియాలో గిబ్లీ స్టైల్ ఫొటోలు వైరల్గా మారాయి. ChatGPT ప్రవేశపెట్టిన గిబ్లీ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి రావడంతో అందరూ తెగ వాడేస్తున్నారు. ప్రముఖులూ తమ ఫొటోలను యానిమే స్టైల్లోకి మార్చుకుంటున్నారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో ఉన్న ఫొటోను గిబ్లీ స్టైల్లోకి మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Similar News
News November 28, 2025
పింఛన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలి:JC

డిసెంబర్ 1న పింఛన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట శుక్రవారం అధికారులకు సూచించారు. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి పింఛన్ పంపిణీ సిబ్బందికి ఇవ్వాలన్నారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలన్నారు. ఒకటో తేదీన నూరు శాతం పింఛన్ నగదు పంపిణీకి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలన్నారు.
News November 28, 2025
కామారెడ్డి: విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వాలు: గుమ్మడి నరసయ్య

విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన పీడీఎస్యూ మహాసభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై పీడీఎస్యూ నిరంతర పోరాటం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు రావలసిన ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 28, 2025
ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు: ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి మర్రిగూడ మండలం సరంపేట నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, మర్రిగూడ తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య తదితరులు పాల్గొన్నారు.


