News August 9, 2024

గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి కొండపల్లి

image

గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. గిరిజనుల వల్లే అడవులను సంరక్షించుకోగలుగుతున్నామన్నారు.

Similar News

News November 25, 2024

విజయనగరం TO పాడేరు వయా అరకు..!

image

విజ‌య‌న‌గ‌రం నుంచి అర‌కు మీదుగా పాడేరుకు త్వరలో బస్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ఆర్టీసీ జోన‌ల్ ఛైర్మ‌న్ సియ్యారి దొన్నుదొర చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి ప‌ర్యాట‌కులు, ఉద్యోగులు అర‌కు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వారికి ఈ బ‌స్సు వ‌ల్ల ప్ర‌యాణం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌న్నారు.

News November 25, 2024

IPL వేలంలో యశ్వంత్‌కు నిరాశ

image

రెండో రోజు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్‌కు నిరాశ ఎదురైంది. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్‌కు రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో యశ్వం‌త్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు ఆసక్తి చూపలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

News November 25, 2024

VZM: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు

image

కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.