News June 27, 2024
గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు: మంత్రి

గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News November 19, 2025
సకాలంలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
News November 18, 2025
అల్లూరిలో ఎన్కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.


