News February 4, 2025
గిరిజన నిరుద్యోగ యువకులకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-డి (32,000) పోస్టులకు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Similar News
News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
News February 13, 2025
హుస్సేన్‌సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్