News April 6, 2025

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి: హుస్సేన్ నాయక్

image

ములుగు జిల్లాలోని వెంకటాపురం(N) మండలంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటించారు. మొక్కజొన్న పంట వల్ల నష్టపోయిన బాధిత రైతులను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో గిరిజనులకు అవకాశం, ఏజెన్సీ రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు.

Similar News

News November 23, 2025

సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

image

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News November 23, 2025

నిర్మల్: పర్యటన రూట్ కాదు.. రిస్క్ రూట్

image

గడిచిన పది నెలల్లో జిల్లాలో 522 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. 612 మంది క్షతగాత్రులు గాయపడ్డారు. ప్రధానంగా నిర్మల్-భైంసా, బాసర-భైంసా, నిర్మల్-ఖానాపూర్ మార్గాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిలా సూచించారు.

News November 23, 2025

వరంగల్: మూఢం ప్రారంభం.. శుభకార్యాలకు బ్రేక్!

image

ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఫిబ్రవరి 17, 2026 వరకు కొనసాగనుంది. దాదాపు మూడు నెలలు శుభముహూర్తాలు లేకపోవడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్ఠాపనలు నిలిచిపోనున్నాయి. రథ సప్తమి, వసంత పంచమి, మాఘపౌర్ణమి కూడా మౌఢ్యంలో పడటం వల్ల కార్యాలు జరగవు. దీంతో ఫంక్షన్ హాళ్లు, జ్యువెలరీ, బట్టల షాపులు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ రంగాల్లో భారీ నష్టం తప్పదని పురోహితులు చెబుతున్నారు.