News February 4, 2025
గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ వినతి

గిరిజన బ్యాంకులు ఏర్పాటు చేసి గిరిజన ఆర్థిక పురోగతి సాధించడానికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేసినట్లు అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి తెలిపారు. గ్రామీణ వికాస్ బ్యాంకుల తరహాలో అవి ఉండాలన్నారు. మైక్రో ఫైనాన్స్, వ్యవసాయ రుణాలు, జీవనోపాధికి మద్దతు వంటి అవసరాలు తీరుస్తాయన్నారు. గిరిజన పర్యాటక రుణాలు, పశువుల బీమా, ఆరోగ్య బీమాకల్పించాలన్నారు.
Similar News
News December 13, 2025
విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
News December 13, 2025
KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
News December 13, 2025
‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.


