News August 3, 2024
గిరిజన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి: సృజన

గిరిజన ఆశ్రమ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సృజన సూచించారు. ఎ.కొండూరులో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం కలెక్టర్ సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సునీతతో కలిసి పునరుద్ధరణ నియామకపు పత్రాలను కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో అందజేశారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీ

జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. VRలో ఉన్న కెవై దాస్ను చల్లపల్లి SIగా, నాగ శివనాధ్ను DCRB SIగా బదిలీ చేశారు. చల్లపల్లి SI PSV సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీషను కూచిపూడి SIగా, ఇనగుదురు SI-1 YVV సత్యనారాయణను DTC పెదవేగి ఏలూరు జిల్లాకు, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ ను అవనిగడ్డ SI-2గా బదిలీ చేస్తూ SP విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
News November 18, 2025
మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్కు ఒప్పందం

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.


