News July 15, 2024

గిరి ప్రదక్షణపై స్వచ్ఛంద సంస్థలతో సమావేశం

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News December 8, 2025

జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

image

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.

News December 8, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.