News July 19, 2024
గిరి ప్రదక్షిణకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ప్లేస్

ఈ నెల 20వ తేదీన జరుగుతున్న గిరి ప్రదక్షిణలో 2,3,4 వీలర్స్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నడిచి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. విజయనగరం మార్గంలో వచ్చే భక్తులు అడవివరం వద్ద, హనుమంతవాక వైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద, రూరల్ ప్రాంతం నుంచి వచ్చేవారు సింహపురి కాలనిలో పార్కింగ్ చేసుకోవాలి.
Similar News
News February 26, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.
News February 26, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు(1/2)

విశాఖ నగరంలో భవన నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో GVMC టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధనం ఉంటే వేగంగా, లేకపోతే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా కొందరికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
News February 26, 2026
విశాఖకు రూ.32,373 కోట్ల రుణ లక్ష్యం

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు నాబర్డు రూ.32,373 కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని సూచించారు.


