News July 11, 2024
గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఐతే ఇది తప్పనిసరి

ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
విశాఖలో నాన్వెజ్ ధరలు

విశాఖపట్నంలో ఆదివారం నాన్వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్లెస్ రూ.280కి, విత్స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.
News November 23, 2025
విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.


