News March 15, 2025
గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.
Similar News
News February 9, 2026
వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
News February 9, 2026
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం దుకాణాల మూసివేత: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.
News February 9, 2026
వరంగల్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు హాజరయ్యారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, సాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.


