News March 27, 2025

గీసుకొండ: కడుపు నొప్పి భరించలేక యువకుడి సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గీసుకొండ మండలంలోని ఎల్కుర్తి హవెలి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నిమ్మకాయల శివ(23)గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ నయం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 19, 2025

భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

image

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్సాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.

News November 19, 2025

మల్లె కొమ్మ కత్తిరింపులు.. ఈ జాగ్రత్తలతో మేలు

image

మంచి దిగుబడికి మల్లె తోటల పెంపకంలో మొదటి కత్తిరింపు పంట నాటిన ఏడాదికి చేయాలి. ఏటా నవంబర్-డిసెంబర్‌లో పొదను కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 -15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి. నవంబర్ చివరి నుంచి జనవరి తొలివారం వరకు కత్తిరింపులు చేస్తే మార్చి నుంచి జులై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకురావు. రైతు ఎక్కువ రోజులు మల్లెను మార్కెటింగ్ చేసి లాభం పొందవచ్చు.

News November 19, 2025

BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) రిసీవబుల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 82 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBD, మహిళలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/