News April 4, 2025
గీసుకొండ: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వరంగల్ ఫస్ట్ అడిషనల్ జిల్లా స్పెషల్ కోర్ట్ జడ్జి ప్రేమలత యావజ్జీవ శిక్ష విధించారు. 2024లో గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాంబయ్య ఓ బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా గురువారం కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
Similar News
News February 24, 2026
సత్తెనపల్లి: రూ. 3.31 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్

సత్తెనపల్లిలో విజిలెన్స్ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక వడ్డవల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3,31,060ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకపోవడం, నాసిరకం, నాణ్యత, COTPA చట్టం ఉల్లంఘనపై కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రవణ్ కుమార్ వివరించారు.
News February 24, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం * 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం * 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం * 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం * 2018- శ్రీదేవి మరణం(ఫొటోలో) * 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు
News February 24, 2026
KNR: ఆన్లైన్ హాల్ టికెట్‌తో అనుమతి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్లైన్ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.


