News March 2, 2025
గీసుగొండ: బాలికపై లైంగికదాడి

నాలుగు సంవత్సరాల బాలికపై లైంగికదాడి చేసిన ఘటన గీసుగొండ మండలంలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం దంపతులు ఇతర రాష్ట్రం నుంచి గీసుగొండ మండలానికి వచ్చారు. ఇక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి 4 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 24, 2025
వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.
News March 24, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.
News March 24, 2025
వరంగల్: చింతకాయ దులపడానికి వెళ్లి మృతి

చింతచెట్టు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్ధన్నపేటలోని నీగిరిస్వామి తండాకి చెందిన నేతవత్ నిమ్మా కూలి పనులు చేస్తుంటాడు. ఇల్లందలో చింతకాయ దులపడానికి కూలికి వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు.