News March 2, 2025
గీసుగొండ: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

మనస్తాపంతో యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గీసుగొండ మండలంలో జరిగింది. గీసుగొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. మరియాపురానికి చెందిన గొలమారి థామస్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన మంజులతో కులాంతర వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కాగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాగా మనస్తాపం చెందిన థామస్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి అక్క నీలిమ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు.
Similar News
News March 22, 2025
కక్కిరాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కక్కిరాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ ఏఐ టూల్స్‌ను నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తుండగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధించిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు.
News March 21, 2025
సివెజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలి: మేయర్

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయనున్న సివేజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలని అధికారులను మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఆరేపల్లి ప్రాంతంలో గల అగ్రికల్చర్ కేంద్రం, బుల్లికుంట ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఎస్టీపీల ఏర్పాటుకు గుర్తించబడిన జోన్లలో ఇప్పటికి కొన్ని స్థానాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
News March 21, 2025
వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.