News February 4, 2025

గీసుగొండ సీఐ హెచ్చరిక

image

సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 9, 2025

మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.

News February 8, 2025

నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: కమిషనర్

image

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. హంటర్ రోడ్డు, యూనివర్సిటీ, శ్రీ సాయి నగర్, వరంగల్, ఆరెపల్లి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. భవన నిర్మాణాలు చెప్పటానికి టీజీ బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

News February 8, 2025

జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం: WGL కలెక్టర్

image

WGL జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద చైర్ పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!