News July 9, 2024
గుంంటూరు యార్డుకు 29,187 బస్తాల మిర్చి రాక

గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 29,187 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 26,159 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.16,500 వరకు పలికింది. దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 7,500 నుంచి 19,000 వరకు లభించింది.
Similar News
News November 27, 2025
అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్లకు ప్రత్యేక పర్యవేక్షణ

అమరావతి ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీసీఆర్డీఏ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రైతుల సమస్యలు, లేఅవుట్ల అడ్డంకులను పరిష్కరించేందుకు 17 మంది అధికారులను డిప్యూటేషన్‌పై నియమించనుంది. వారిలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, అయిదుగురు తహశీల్దారులు, అయిదుగురు డిప్యూటీ తహశీల్దారులు ఉన్నారు. వీరు భూయజమానులతో నేరుగా చర్చించి ఎల్పీఎస్‌లో భాగస్వామ్యం కల్పిస్తారు.
News November 26, 2025
GNT: ఎండీఎంఏ రవాణాపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

గుంటూరులో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది. ఒక వారం వ్యవధిలో ఎండీఎంఏ కొనుగోలు,అమ్మకాలకు సంబంధించిన ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో డ్రగ్స్ దాచి యువతకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వృత్తి విద్య చదువుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని అలవాటు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు–గుంటూరు మార్గంలో రవాణాపై నిఘా కొనసాగుతోంది.
News November 24, 2025
ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.


