News January 27, 2025
గుంజపడుగు: అనారోగ్యంతో యువకుడి మృతి

మంథని మండలం గుంజపడుగులో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అక్కపాక నరేశ్(34) గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, గత వారం రోజులుగా నరేశ్ జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News November 7, 2025
విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.
News November 7, 2025
నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.
News November 7, 2025
రేపు కుప్పంలో రూ.2 వేల కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 7 పరిశ్రమల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంతం పారిశ్రామిక వికాసం దిశగా ప్రగతి పథంలో ముందడుగు వేయడంలో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు రానున్నాయి. దీని ద్వారా దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి.


