News February 12, 2025
గుంటుపల్లిలో కుళ్లిపోయిన మృతదేహం కలకలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290531641_51973468-normal-WIFI.webp)
గుంటుపల్లి శివారులో మంగళవారం కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గుంటుపల్లి శివారు కృష్ణానది ఒడ్డున ఓ షెడ్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుమారుగా 30 రోజుల క్రితం వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 12, 2025
మొన్న 90 గంటల పని, భార్యనెంత సేపు చూస్తారు.. నేడు మరో వివాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357084109_1199-normal-WIFI.webp)
వారానికి 90Hrs పని, భార్యను ఎంతసేపు చూస్తారన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి తెరతీశారు. టెకీస్ సహా భారత శ్రామికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరని, పరిశ్రమలకు సవాళ్లు సృష్టిస్తారని చెప్పారు. ‘నేను జాయిన్ కాగానే నాది చెన్నై అయితే మా బాస్ ఢిల్లీకి రమ్మన్నారు. ఇప్పుడు నేను చెన్నై వ్యక్తికి ఇదే చెప్తే రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. IT ఉద్యోగులైతే ఆఫీసుకు రమ్మంటే BYE చెప్పేస్తార’న్నారు.
News February 12, 2025
బాదేపల్లి మార్కెట్లో నేటి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350577415_52030806-normal-WIFI.webp)
జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.
News February 12, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357285585_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.