News March 23, 2025

గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

image

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతిని హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.

Similar News

News January 4, 2026

ఇంద్రవెల్లి: పాముకాటుతో బాలుడి మృతి

image

ఇంద్రవెల్లి మండలం సకారాం తాండకు చెందిన దయారాం భాగ్యశ్రీ దంపతులకు కుమారుడు విశ్వనాథ్ (4) పాము కాటుతో మృతి చెందాడు. శుక్రవారం పిల్లలతో కలిసి రేగి పండ్లు చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తింటున్న సమయంలో పాము కాటేసింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News January 4, 2026

పాక్ తరహాలోనే బంగ్లాతోనూ క్రికెట్ కష్టమే!

image

పాక్ తరహాలోనే బంగ్లాదేశ్‌తోనూ భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులే దానికి కారణం. SEPలో భారత్ తమ దేశంలో పర్యటిస్తుందని BCB ప్రకటించింది. కానీ BCCI దానిని కన్ఫామ్ చేయలేదు. పైగా IPL నుంచి బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్‌ను తప్పించారు. దీంతో బంగ్లా కూడా T20WC మ్యాచులు భారత్‌లో ఆడకూడదని, తమ వేదికలు మార్చాలని ICCని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 4, 2026

జనవరి 4: చరిత్రలో ఈరోజు

image

* 1643: శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్(ఫొటోలో లెఫ్ట్) జననం
* 1809: బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ జననం
* 1889: భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి జననం
* 1945: నటుడు, దర్శకుడు ఎస్.కె.మిశ్రో జననం
* 1994: సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మరణం
* 2015: నటుడు ఆహుతి ప్రసాద్ మరణం
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం