News March 10, 2025
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: పెమ్మసాని

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
గుంటూరు మేయర్‌గా కోవెలమూడి?

గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేయడంతో నెక్స్ట్ మేయర్ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆశావహుల పేర్లలో కోవెలమూడి రవీంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం మేయర్ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పెమ్మసాని గుంటూరు వచ్చిన వెంటనే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మేయర్‌ని ఎన్నుకునే అవకాశముంది.
News March 21, 2025
మాచవరంలో మహిళ దారుణ హత్య

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సీతారత్నం (61) ను అతి దారుణంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. మాచవరం PHCలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ శ్రీనివాసరావుకు సీతారత్నంకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. డబ్బులు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ కావడంతో ఈ హత్య జరిగినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకటరావు తెలిపారు.
News March 21, 2025
కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.