News May 20, 2024
గుంటూరును పాలించిన రాజవంశీయులు వీరే..
గుంటూరు కొన్ని ప్రసిద్ధ రాజవంశాలచే పాలించబడింది. వారిలో శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రికలు, కోటవంశీయులు, విష్ణుకుండినలు, చాళుక్యలు, చోళులు, కాకతీయులు, విజయనగర వంశీయులు, కుతుబ్ షాహిలు ఉన్నారు. కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని గుంటూరులోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు.
Similar News
News December 8, 2024
యాక్సిడెంట్.. ఇద్దరు మిత్రులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని షేట్‌బషీరాబాద్‌లో జరిగింది. పల్నాడు జిల్లా రాజులపాలెం గ్రామానికి చెందిన అనీల్(25), HYDలో ఉంటున్న కార్తీక్ రెడ్డి(26) స్నేహితులు. అయ్యప్ప మాలలో ఉన్న వీరు శుక్రవారం శబరిమల వెళ్లి తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా అనీల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.
News December 7, 2024
అమరావతిలో నిర్మాణాల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి ప్రాంతంలో పనుల పునః ప్రారంభంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించననుంది. ఎంపిక చేసిన పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు వివిధ ప్రాజెక్టు పనులు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. కాగా కూటమి అధికారంలోకి రాగానే అమరావతిలో పర్యటించడంతో పాటు.. భవనాల పటిష్ఠతపై నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే.
News December 7, 2024
సాయుధ దళాల పతాక దినోత్సవంలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మనం అందించే సహాయం దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవాన్ల కుటుంబ సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. శనివారం కలక్టరేట్‌లో ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల కార్యక్రమాన్ని కలెక్టర్ మొదటి విరాళాన్ని ఇచ్చి ప్రారంభించారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే. శ్రీనివాస రావు కూడా విరాళాలు అందించారు.