News August 27, 2024
గుంటూరులో ఆ టైంలో వాటికి నో ఎంట్రీ

గుంటూరులో నో ఎంట్రీ టైంను పక్కాగా అమలు చేస్తామని ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నో ఎంట్రీ టైం అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో నగరంలోకి ట్రాక్టర్లు, లారీల ఎంట్రీకి అనుమతి లేదని చెప్పారు. చుట్టుగుంట నుంచి, SVN Colony నుంచి, JKC కాలేజ్, శ్యామల నగర్ నుంచి గుంటూరులోకి వస్తే చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News October 31, 2025
పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2025
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
News October 31, 2025
పెదకాకాని మండలం తెనాలి డివిజన్లోకి.?

జిల్లా పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెదకాకాని మండలం తెనాలి రెవెన్యూ డివిజన్లోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ మార్పు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం గుంటూరు, తెనాలి డివిజన్లలో విభజింపబడి ఉండటంతో పెదకాకాని మార్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.


