News August 7, 2024

గుంటూరులో జాబ్ మేళా.. అర్హతలివే

image

గుంటూరు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.రఘు తెలిపారు. పేటీఎం, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, జయలక్ష్మి ఆటోమొబైల్స్, పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News December 10, 2025

క్రిస్మస్ రద్దీకి గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

image

క్రిస్మస్ సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుంటూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07196) ఈ నెల 24, 30 తేదీల్లో రాత్రి 7.30కి బయలుదేరుతుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. కాకినాడటౌన్–చర్లపల్లి (07195) ఈ నెల 28, 31 తేదీల్లో సాయంత్రం 7.50కి స్టార్ట్ అయ్యి గుంటూరు మీదుగా వెళ్తుంది.

News December 9, 2025

గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

image

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.