News December 7, 2024
గుంటూరులో థాయ్లాండ్ అమ్మాయిలతో వ్యభిచారం.!

గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్లో జరుగుతున్న వ్యభిచార గుట్టు పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఒకే సారి 17 సెంటర్లపై ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో థాయ్ లాండ్కి చెందిన నలుగురు, నార్త్ ఇండియాకి చెందిన ముగ్గురు, మరో స్పా సెంటర్లో ఏడుగురు యువతులు, ముగ్గురు విటులు, ఆయా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
Similar News
News October 18, 2025
తెలుగులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు

రావూరి భరద్వాజ (జులై 5, 1927- అక్టోబరు 18, 2013) గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు. తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.
#నేడు ఆయన వర్ధంతి
News October 18, 2025
GNT: ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి..!

గుంటూరు జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడడంతో, ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు మెలిక పెట్టాయి. బీటెక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాత ఫీజుల పేరుతో పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
News October 18, 2025
23 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. విద్య, మహిళ శిశు సంక్షేమ శాఖ, నైపుణ్య అభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జనన ధృవీకరణ పత్రాలు లేనివారు దరఖాస్తులు చేసుకొని ధృవీకరణ పత్రాలు పొందాలన్నారు. ఈ నెల 23 నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్ లుజరుగుతాయన్నారు