News August 4, 2024

గుంటూరులో నర్సుపై ఉన్మాది బ్లేడుతో దాడి

image

వడ్డేశ్వరంలోని వసతి గృహం వద్ద యువతిపై ఓ ఉన్మాది బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతి నర్సుగా పనిచేస్తూ వడ్డేశ్వరంలోని వసతి గృహంలో ఉంటుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నిందితుడు క్రాంతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

Similar News

News September 10, 2024

గడువులోగా సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

image

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News September 9, 2024

11న గుంటూరు రానున్న వైసీపీ అధినేత జగన్

image

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్- జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.

News September 9, 2024

మంత్రి అనగాని ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు

image

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. అనంతరం మంత్రి ఓఎస్‌డీగా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్‌ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు.