News April 20, 2024

గుంటూరులో నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే

image

గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. షేక్ నూరి ఫాతిమా(YCP), గూడవల్లి మణికుమారి (బహుజన్ సమాజ్ పార్టీ), షేక్ రజాక్ (నవతరం పార్టీ), షేక్ దుర్రే షహవర్ (స్వతంత్ర), కాజా రాఘవేంద్ర సంజీవరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా). గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి రోశయ్య (వైసీపీ), షేక్ అస్లాం అక్తర్(స్వతంత్ర), అక్కిశెట్టి శ్రీకృష్ణ (స్వంతత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

Similar News

News November 18, 2024

బాలుడిని కొట్టి చంపిన తోటి విద్యార్థులు

image

ఓ విద్యార్థిని సహచర విద్యార్థులు కొట్టి చంపి బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. పొన్నెకల్లులో సమీర్ అనే 9వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు గత నెల 24న గొడవపడి కొట్టి చంపి బావిలో పడేశారు. స్థానికులు గమనించి ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కుటుంబసభ్యులకు అప్పగించగా, బాలుడి ఒంటిపై రక్తపు గాయాలు ఉండడాన్ని గమనించడంతో వెలుగులోకి వచ్చింది.

News November 18, 2024

‘శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు’

image

శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని తొక్కేశాడని, కుటుంబంలో వివాదం ఉందని జగన్ మీడియా వార్తలు రాయటం దారుణమన్నారు. సొంత మనుషులను రాజకీయంగా వాడుకొని ఎలా వదిలేయాలో జగన్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అన్నారు. ముందు తల్లి, చెల్లికి సమాధానం చెప్పాలన్నారు.

News November 17, 2024

విద్యార్థిని ఆత్మహత్యపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్

image

నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.