News May 3, 2024
గుంటూరులో నేటి నుంచి హోమ్ ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. ఆయన కౌన్సిల్ హాలులో ఎన్నికల అధికారులతో మాట్లాడారు. 80 ఏళ్లుపైన ఉండి హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
Similar News
News October 16, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.
News October 16, 2025
దుగ్గిరాల వైసీపీ జెడ్పీటీసీ భర్త అరెస్ట్ ?

దుగ్గిరాల మండలం వైసీపీ జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన భార్య అరుణ ఆరోపించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న తన భర్తను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని అన్నారు. తాడేపల్లి స్టేషన్కు తరలిస్తున్నామని చెప్పారని.. కానీ తన భర్త అక్కడ లేదని అరుణ ఆరోపించారు. ఈ మేరకు తన భర్త ఆచూకీ చెప్పాలని తాడేపల్లి ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు.
News October 16, 2025
గుంటూరులో సినీనటులపై NSUI ఫిర్యాదు !

తెలుగు సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ పై NSUI గుంటూరు బృందం లాలాపేట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. NSUI జిల్లా అధ్యక్షుడు కరీమ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పై వారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశామని అన్నారు.