News May 5, 2024
గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్ను అతని భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్కు మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
Similar News
News October 14, 2025
తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.
News October 14, 2025
GNT: సైబర్ నేరాలకు పాల్పడుతున్న వంటమాస్టర్ అరెస్ట్ !

గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన రైస్ మిల్లు యజమాని వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. కోటి కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొల్లుకు చెందిన నిందితుడు ఇంటర్ చదివి బెంగుళూరులో వంటమాస్టర్గా పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అలా కొల్లగొట్టిన డబ్బును అతని స్నేహితులు ఖాతాలకు మళ్లించడంతో పాటూ క్రికెట్ బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 13, 2025
ఇంటింటి సర్వేతో మున్సిపాలిటీల్లో పెరిగిన ఆదాయం

పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకోవాలని మున్సిపాలిటీలు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటింటి పన్నుల పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు పన్నులు వేయని ఆస్తులు, తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించి ఇంటింటి సర్వే చేపట్టారు. దీంతో పన్నుల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. గుంటూరు: 460, మంగళగిరి: 397, తెనాలి: 84, పొన్నూరు: 31, లక్షల్లో ఆదాయం సమకూరింది.