News February 6, 2025

గుంటూరులో మహేశ్ బాబు ఓటు తొలగింపు 

image

ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఆయన పేరుతో ఓటు తప్పుగా నమోదు అయిందని GMC అడిషనల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. ఫారం-7 విచారణ అనంతరం ఓటు హక్కును తొలగించినట్లు ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

Similar News

News October 22, 2025

కడప జిల్లాలో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా నేడు స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు, ఇబ్బందులు ఆధారంగా సెలవును మండల MEOలు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కొద్దిసేపటి క్రితమే సర్కిలర్ జారీ చేశారు.

News October 22, 2025

మల్లోజుల, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ!

image

ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు ‘Y’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాళ్లు నమ్మకద్రోహం చేశారని, శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల హెచ్చరిక లేఖ విడుదలైంది. దీంతో ఆ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే చెడ్డపేరు వస్తుందని, ఇతర మావోయిస్టుల లొంగుబాట్లకు ఇబ్బంది వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

News October 22, 2025

కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.