News September 27, 2024
గుంటూరులో రోడ్డు పక్కన మహిళ మృతదేహం

గుంటూరులో రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్‌పేటకు చెందిన మారెళ్ల రేవతి(52) అనారోగ్యంతో రోడ్డున మృతి చెంది పడి ఉంది. స్థానికులు గమనించి కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ మృతదేహాన్ని గుంటూరు GGH మార్చురీకి తరలించారు. ఆమె వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.
Similar News
News December 6, 2025
GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.
News December 6, 2025
నేడు అంబేడ్కర్ వర్థంతి.. నారా లోకేశ్ ట్వీట్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేశ్ ‘X’ లో పోస్ట్ చేశారు. ‘దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం కృషిచేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అంటూ రాసుకొచ్చారు.
News December 6, 2025
‘రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్’పై శిక్షణ

అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కోసం APCRDA కార్యాలయంలో కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.


