News March 25, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.

Similar News

News September 7, 2024

గుంటూరు: తల్లీకూతుర్ల నేర చరిత్ర ఇదే..!

image

అమాయక మాటలతో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠాలోని తల్లి కూతుళ్ల నేరచరిత్ర ఇది. 2022 మార్కాపురంలో ఆస్తికోసం మేనత్తను సైనైడ్‌తో చంపిన వైనం, 2023 తెనాలిలో అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధురాలని కూల్ డ్రింక్‌లో సైనెడ్ కలిపి చంపేశారు. 2024 తెనాలిలో బీమా డబ్బులు కోసం మద్యంలో సైనెడ్ కలిపి వ్యక్తిని చంపారు. వీరిని గుంటూరు పోలీసులు నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News September 7, 2024

గుంటూరు: ఫోన్ కాల్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన SP

image

ఓ ఫోన్ కాల్‌తో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తన భర్త సోనోవిజన్లో పనిచేస్తున్నాడని, తాను చనిపోతున్నా అంటూ సెల్ఫీ వీడియో పంపించారని కాపాడాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ని ఓ మహిళ కోరింది. స్పందించిన ఆయన.. ఐటీ విభాగం ద్వారా ఆ వ్యక్తి తాడేపల్లిలో ఉన్నట్లు గుర్తించి తాడేపల్లి సీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు కాపాడారు.

News September 7, 2024

నేడు గుంటూరు జిల్లాకు వర్షసూచన

image

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న కృష్ణా జిల్లాల సైతం నేడు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.