News February 25, 2025
గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Similar News
News February 25, 2025
గుంటూరు : ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

గుంటూరులోని గోరంట్లలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు తల్లీ, కూతురుగా పోలీసులు నిర్ధారించారు. అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వింజమూరి నాగలక్ష్మి (38), చరణ్య (14) లు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద రహదారిని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.
News February 25, 2025
మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
News February 25, 2025
పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.