News June 16, 2024
గుంటూరులో వ్యభిచార గృహాలపై దాడి
వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.
Similar News
News September 9, 2024
11న గుంటూరు రానున్న వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్- జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.
News September 9, 2024
మంత్రి అనగాని ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. అనంతరం మంత్రి ఓఎస్డీగా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు.
News September 9, 2024
24 గంటల్లోగా పంట నష్టం అంచనా వేయాలి: కలెక్టర్
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల అంచనాను 24 గంటల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వం అందించిన ఫార్మాట్లలో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ అంచనాలు విడివిడిగా అందజేయాలన్నారు. పట్టణాలు, మండలాల్లో ఇళ్లు దెబ్బతిన్న వాటిని వేర్వేరుగా నమోదు చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.