News February 26, 2026

గుంటూరు: అంబటిని కలిసిన కాసు మహేశ్ రెడ్డి

image

మాజీ మంత్రి అంబటి రాంబాబును గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి ఇంటిపై జరిగిన దాడుల ఉదంతంపై వీరిద్దరూ చర్చించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతున్నాయని, అంబటి అరెస్ట్ కావడం బాధాకరమని కాసు మహేశ్ రెడ్డి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Similar News

News April 14, 2026

నేడు పెద్దపల్లిలో వీ-హబ్ ప్రారంభం

image

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 11 గంటలకు పెద్దపల్లిలో వీ-హబ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం మంథనిలో రూ.32 లక్షలతో నిర్మించిన జేబీఎస్ పాఠశాలను మంత్రి ప్రారంభిస్తారు. శివ కిరణ్ గార్డెన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేయనున్నారు.

News April 14, 2026

బీర్లను తెగ తాగేస్తున్నారు!

image

ఎండలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఏపీలో 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో ఆ సంఖ్య 26.11 లక్షల కేసులకు పెరిగింది. అలాగే గతేడాది APR 1-12 వరకు 8.16 లక్షల కేసులు అమ్మితే ఈసారి అదే సమయంలో 9.2 లక్షల కేసులను విక్రయించారు. అటు <<19296712>>తెలంగాణలోనూ<<>> బీర్ల అమ్మకాలు 40 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.

News April 14, 2026

ప్రకాశం: మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

image

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.