News April 11, 2025
గుంటూరు: అగ్నివీర్ నియామకాల గడువు పొడిగింపు

భారత సైన్యంలో అగ్నిపథ్ ద్వారా అగ్నివీర్ నియామకాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 25 వరకు పెంచినట్లు గుంటూరు రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. జూన్లో 13 భాషల్లో జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగులోనూ నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల అభ్యర్థులు అగ్నివీర్ టెక్నికల్, జీడీ, ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News October 21, 2025
మెప్మా-మన మిత్ర యాప్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే.. అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి మన మిత్ర యాప్ను ప్రారంభించారు.
News October 21, 2025
పంటపొలాలకు సాగునీటి పై దృష్టి పెట్టాలి: కలెక్టర్

జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
News October 20, 2025
స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు

కోన ప్రభాకరరావు 1916, జులై 10న బాపట్లలో జన్మించారు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసి మద్రాసులో పట్టభద్రుడయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు.1967, 1972, 1978 శాసనసభకు ఎన్నికయ్యారు.1980-81 వరకు శాసనసభ సభాపతిగా పనిచేశారు.1983 సెప్టెంబరు 2న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యారు.
అక్టోబరు 20 1990న హైదరాబాదులో మరణించారు.