News May 25, 2024
గుంటూరు: అడల్ట్ BCG వ్యాక్సిన్‌కు 1.77 లక్షల మంది సమ్మతి

అడల్ట్ BCG వ్యాక్సిన్ వేయించుకోవటానికి గుంటూరు జిల్లాలో 1.77లక్షల మంది వారి సమ్మతి తెలియజేశారని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 12 జిల్లాలను కేస్ స్టడీ కింద ఎంపిక చేశారని, వాటిల్లో గుంటూరు జిల్లా కూడా ఒకటని తెలిపారు. కావున జిల్లాలో వ్యాక్సిన్ కోసం సమ్మతి తెలియజేసిన వారికి ప్రతి గురువారం వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వ్యాక్సిన్ వేస్తారన్నారు.
Similar News
News November 23, 2025
గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

2025–26 సీజన్‌కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్‌లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.
News November 23, 2025
GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


