News June 13, 2024
గుంటూరు: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన లారీ

రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జరిగింది. గురువారం కొమ్మూరు గ్రామంలో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 21, 2025
మాచవరంలో మహిళ దారుణ హత్య

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సీతారత్నం (61) ను అతి దారుణంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. మాచవరం PHCలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ శ్రీనివాసరావుకు సీతారత్నంకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. డబ్బులు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ కావడంతో ఈ హత్య జరిగినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకటరావు తెలిపారు.
News March 21, 2025
కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.
News March 21, 2025
గుంటూరులో ఉత్సాహంగా మహిళల ఆటల పోటీలు

పని ఒత్తిడి నుంచి విముక్తికి క్రీడలు దోహదపడతాయని CPDCL ప్రాజెక్ట్స్ డైరెక్టర్ KL.మూర్తి అన్నారు. ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ (విజయవాడ) సర్కిల్ ఉమెన్స్ గేమ్స్, కల్చరల్ కాంపిటీషన్స్‌ని గురువారం గుంటూరులో పరిశీలించారు. చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. గుంటూరు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కేవీఎల్ఎన్ మూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.