News July 5, 2024
గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడన్నారు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న గడ్డి మందు తాగడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.
Similar News
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
News December 13, 2025
మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.


