News April 5, 2024

గుంటూరు అమ్మాయి.. బెల్జియం అబ్బాయి ప్రేమ వివాహం

image

గుంటూరు అమ్మాయికి బెల్జియం అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరు శివారు లాల్ పురానికి చెందిన పుష్పలత హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ. ప్రాజెక్ట్ పనిపై బెల్జియం వెళ్లారు. అక్కడ ప్రాజెక్టులో పని చేస్తున్న బెల్జియంకు చెందిన క్రిష్ పోలేంటితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గుంటూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Similar News

News October 23, 2025

పీజీఆర్ఎస్ అర్జీల పట్ల మనసు పెట్టండి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీసుకున్న అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌లో వచ్చే ప్రతి సమస్యను హృదయ పూర్వకంగా అవగాహన చేసుకుని, వారి స్థానంలో ఆలోచించి వాస్తవ పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో సమస్యలు పరిష్కారం కావాలన్నారు.

News October 22, 2025

పారిశుద్ధ్యం, నీటి విషయంలో శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించటంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో బుధవారం తమీమ్ అన్సారియా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, వ్యర్ధాల సేకరణ, నిర్వహణ, సాలిడ్, లిక్వీడ్ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టుల పై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.

News October 22, 2025

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. వాగులు, నదులు దాటుటకు, ఈదుటకు ప్రయత్నం చేయవద్దన్నారు.