News July 5, 2024
గుంటూరు: ఆన్లైన్ మోసం.. రూ.10లక్షలు స్వాహా

ఆన్లైన్ మోసంపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరిటెపా డుకు చెందిన హేమంత్ కుమార్ టెలిగ్రామ్ యాప్లో ఓ టాస్క్ ఆపరేట్ చేశాడు. అందులో టాస్క్ పెట్టి పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని చెబుతారు. టాస్క్ నిర్వాహకులు చెప్పిన విధంగా పలుమార్లుగా రూ.10లక్షలు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 19, 2025
GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.
News October 19, 2025
గుంటూరు: ‘కాలుష్యం లేని దీపావళి..ఆనందమైన దీపావళి’

కాలుష్యం లేని దీపావళి ఆనందమైన దీపావళిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దీపావళిపై రూపొందించిన పోస్టర్ను శనివారం కలెక్టర్ విడుదల చేశారు. దీపాలను వెలిగించడం మన సంస్కృతిలో భాగమని కాలుష్యానికి కారణమయ్యే టపాసుల జోలికి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఈ నెల 20న దీపావళి పండగ సందర్భంగా ప్రజలు హరిత టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
News October 18, 2025
GNT: వారి భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోలీసులు గంజాయి పట్టుకుంటున్నారు. ఇటీవల యువతలో మాదకద్రవ్యాల వాడకం పెరగటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాల వాడకానికి దారితీసే అనుమానాస్పద ప్రవర్తన, స్నేహ వర్గం, ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. @ యువ భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!