News July 15, 2024

గుంటూరు: ఆరుగురు నిందితులకు బెయిల్ నిరాకరణ

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరులోని జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Similar News

News October 4, 2024

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్

image

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్ తగిలింది. గతంలో వెలగపూడిలో జరిగిన ఓ మహిళ మర్డర్ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పీటీ వారెంట్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నెల 7వ తేదీన తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలు నుంచి మంగళగిరి కోర్టులో నందిగం సురేశ్‌ను హాజరు పరచనున్నారు. దీంతో సురేశ్‌కు గట్టి షాక్ తగిలినట్లు అయింది.

News October 4, 2024

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ సతీశ్

image

ప్రజలు, పోలీసులు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. చేబ్రోలు మండలంలోని గొడవర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆయన వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా కలిసి మెలసి ఉంటే ఎటువంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News October 3, 2024

కారంపూడి: ‘ప్రియుడి మోజులో భర్తను హత్య చేసింది’

image

కారంపూడి మండలం పేట సన్నగండ్ల పరిధిలోని తండాలో బుధవారం దారుణ ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తండాకు చెందిన హనీమి బాయ్ భర్త గోపి నాయక్‌ను హత్య చేసిందన్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌లో గడ్డి మందు కలిపినట్లు పిల్లలు చెబుతున్నారని తెలిపారు. దీంతో గోపినాయక్ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.