News October 17, 2024
గుంటూరు: ఆ పరీక్షలు యధాతథంగా జరుగుతాయి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఈ నెల 27 నుంచి జరగాల్సిన UG, PG 2, 4 సెమిస్టర్ పరీక్షలు యధాతథంగా జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ సమన్వయకర్త డా.రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున నేడు ప్రారంభం కావాల్సిన UG, PG 1,3 సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశామని, 2,4 సెమిస్టర్ పరీక్షలు మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 9, 2025
ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఆరోగ్య అధికారి

జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
News December 9, 2025
21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం: కలెక్టర్

ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


