News December 20, 2024

గుంటూరు: ‘ఆ బాధ్యత మనందరిపై ఉంది’ 

image

విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడి భావితరాల వారికి ఇంధన వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. గురువారం, కలెక్టరేట్లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యుచ్ఛక్తి ఆదాలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం కావాల్సి ఉందన్నారు. 

Similar News

News January 26, 2025

గుంటూరు జిల్లాలో నేడు ఆ రెండు బంద్

image

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమవారం ఉద‌యం తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావ‌డంతో మందు, ముక్క‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామ‌నుకున్న వారికి ఇది బ్యాడ్‌ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

News January 26, 2025

ANU: వన్ టైం ఆపర్చునిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెగ్యులర్, సప్లమెంటరీలతో పాటు 4వ సెమిస్టర్ లో వన్ టైం ఆపర్చునిటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 20లోగా ఫీజులు చెల్లించాలన్నారు. రూ.100 అపరాదంతో ఫిబ్రవరి 24లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఫీజుల వివరాలు, పరీక్షల షెడ్యూల్ www.anu.ac.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చుని తెలిపారు.

News January 25, 2025

మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం

image

మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.